డిజైన్స్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవటం నిజంగా మనకు సాధ్యం అవుతుందా.! పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే ప్రతి వస్తువు ఏదో ఒక రకమైన డిజైన్ ని కలిగి ఉండేదే.!
మన ఆలోచనలు, అలవాట్లు, మన భవిష్యత్తు, మన చుట్టూ ఉండే ప్రపంచం.. ఇలా… అన్ని, ఎవరికి వారు నచ్చినట్టే ఉండాలి. ఇది అందంగా ఉంది, అది అందంగా లేదు, ఆ కలర్ బాగుంది, ఈ షర్ట్ డిజైన్ అంత బాగా లేదు అని, డిజైన్ల గురించి ఒక్క ముక్క అవగాహన లేని వారు కూడా సలహాలు ఇచ్చేస్తుంటారు.
గ్రాఫిక్ డిజైనింగ్ ట్రెండ్ ల గురించి, కలర్ థియరీ మరియు డిజైనింగ్ స్కిల్స్ లాంటి విషయాల గురించి అందరికి అవసరం లేకపోయినా, క్రియేటివ్ గా ఉండాలనుకునే ఏ డిజైనర్లకి అయినా చాలా అవసరం.
ఎందుకంటే.! ఎప్పటికప్పుడు డిజైనింగ్ ట్రెండ్ల గురించి తెలుసుకోకుండా ఉంటే.! కొత్త రకమైన డిజైన్లు ఆలోచించటమే కాదు ఒక డిజైనర్ గా మన మార్కెట్ వాల్యూ ని కూడా పెంచుకోవడం జరగదు. నిజానికి, ప్రపంచ స్థాయి కాన్వాస్ మీద ప్రతిసారి రక రకాల ట్రెండ్స్ వస్తుంటాయి పోతుంటాయి, అందులో కొన్ని డిజైనింగ్ ట్రెండ్స్ ల హవా చాలా సంవత్సరాల పాటు నడుస్తుంది, కొన్ని మధ్యలోనే ముగిసిపోతాయి.
సో.! మన డిజైన్ బ్రాండ్ వాల్యూ పెరగాలంటే, ఖచ్చితంగా డిజైన్ ట్రెండ్ లని ఫాలో అవ్వాల్సిందే.!
అసలు డిజైన్ సాఫ్ట్వేర్ల మీద ఎలాంటి అనుభవం లేకపోయినా సరే రంగులు వాటి అర్థాలు, డిజైన్ సిద్ధాంతాలు లాంటి చాలా విషయాలు అర్ధం చేసుకోటానికి ప్రయత్నం చేద్దాం
DESIGN